మెదక్ జిల్లాలో రూ.13 కోట్ల వ్యయంతో మెదక్, నర్సాపూర్, కౌడిపల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం మెదక్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటిన్నర రూపాయల వ్యయంతో అధునాతన ధోబి ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రజకులు, నాయి బ్రాహ్మణులకు ఉచితంగా రూ.300 కోట్ల బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు.