ఏప్రిల్ నుంచి రూ.3 లక్షలతో సొంతింటి జాగాలో ఇళ్ల నిర్మాణం : హరీష్ రావు

-

మెదక్ పట్టణం లోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభ లో మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. దక్షిణ భారత దేశంలోనే సంత్ గార్గే బాబా విగ్రహాన్ని మెదక్ లో ఈ ఓటు అని.. చాకలి ఐలమ్మ స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడని వెల్లడించారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు దేశంలో ఎక్కడా లేవని.. ఏప్రిల్ మొదటి వారం నుంచి రూ మూడు లక్షలతో సొంతింటి జాగా లో ఇళ్ల నిర్మాణం చెపడుతున్నామని ప్రకటన చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉందని.. 33 జిల్లాల్లో రెండేసి కోట్ల తో మాడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామన్నారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు ,నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. 80 శాతం సబ్సిడీ తో రజకులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తామన్నారు.

మెదక్ లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించామని.. కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. రజకులను ఎస్సి జాబితా లో చేర్చే విషయంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని.. మెదక్ కు మెడికల్ కాలేజీ తో పాటు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 60 ఏండ్ల కాంగ్రెస్,టిడిపి పాలనలో మూడే మెడికల్ కాలేజీ లు వచ్చాయని.. అరేండ్ల లో తెలంగాణ లో 33 మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news