గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ గేట్లు తెరుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మార్కెట్‌ను తెరవాలంటూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి మెమో జారీచేశారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నర్సింహారెడ్డి మార్కెట్ గేట్లను తెరచి కమీషన్ ఏజెంట్లను లోపలికి అనుమతించారు. 160 రోజుల తర్వాత మార్కెట్ తెరుచుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఆవరణలో సంబరాలు చేసుకున్నారు.