అసెంబ్లీ వార్: టీడీపీకి చుక్కలేనా?

-

ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా ఉండేది..కానీ ఇప్పుడు అధికార-ప్రతిపక్షాలు తిట్టుకునే వేదికగా మారిపోయింది..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్తితి…అసెంబ్లీ అంటే అధికార పార్టీ నేతలు…తమ సీఎంకు భజన చేయడం..అలాగే ప్రతిపక్ష నేతలని తిట్టడం, వారు మాట్లాడుతుంటే అడ్డుపడటం, రన్నింగ్ కామేటరీ చేయడం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చెప్పారు…ఎంతసేపు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి చూస్తుంటారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

ఇక ఆ మధ్య ఏపీ అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలిసిందే..కొందరు వైసీపీ నేతలు..చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి ఎలా అసభ్యమైన వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు..అలాగే ఆ మాటలకు బాధపడి బాబు కన్నీరు పెట్టుకున్నారు..ఇకపై తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని, మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని చెప్పి, బాబు శపథం చేశారు.

అయితే తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావడం లేదు..కానీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు..మొదట సమావేశాలకు వెళ్లకూడదని అనుకున్నారు..దాని బదులు ప్రత్యామ్నాయంగా వేరే కార్యక్రమాలు ఏమన్నా చేయాలని అనుకున్నారు..కానీ సీనియర్ నేతలు కొందరు..బడ్జెట్ సమావేశాలు కాబట్టి, అసెంబ్లీకి వెళితేనే బెటర్ అని సూచించారు..అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి బాగోలేదు కాబట్టి..సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలని నిలదీయాలని తెలిపారు..దీంతో చంద్రబాబు మినహా, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

కాకపోతే సమావేశాలకు వెళితే అనుకున్న విధంగా..టీడీపీ, వైసీపీని నిలదీయడం కుదరదనే చెప్పాలి..అసలే వైసీపీకి బలం ఎక్కువ..పైగా వారు టీడీపీ వాళ్లపై సెటైర్లు వేసేస్తారు..అలాగే విమర్శలు గట్టిగానే ఉంటాయి..ఇక టీడీపీ వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు..అంటే వైసీపీ..టీడీపీకి చుక్కలు చూపించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అలాగే టీడీపీ ఏమన్నా సమస్యలపై నిలదీస్తే వైసీపీ ఎదురు దాడి చేసే ఛాన్స్ ఉంది..పైగా బాబు అసెంబ్లీ రాకపోవడంపై కూడా సెటైర్లు వేయొచ్చు. మొత్తానికి అసెంబ్లీలో టీడీపీకి ఇబ్బందికర పరిణామలే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news