మనిషి సానుకూలంగా జీవించడానికి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మనం స్వహతగా గొప్ప వ్యక్తులం కానీ ఆత్మన్యూనత భావంతో ప్రతి పనిలో శ్రద్ధ వహించలేక పోతున్నాం. మేధావి అయినా సాధారణ మనిషి అయినా విషయాన్ని కథల ద్వారా గ్రహించేందుకు ఇష్టపడతాడు.
మనకు స్పూర్తి నిచ్చే కథలు భారతీయ ప్రాచీన సాహిత్యం లో ఎన్నో ఉన్నాయి. చదువురాని వారికి సైతం ఆ సాహిత్యం అర్థం చేసుకునేలా మన పూర్వీకులు పలు రకాల బోధనా పద్ధతులు నెలకొల్పారు. కథలలో కొంత కల్పానికత కనిపించినప్పటికీ కథ వెనుక ఉన్న స్ఫూర్తి , నైతికత ప్రధాన భూమిక పోషిస్తాయి.
భూమి మీద నివసించే ప్రతి జీవిలోనూ అనంత శక్తి దాగి ఉంది. వ్యతిరేక భావాలను మనసులో నింపుకుంటూ మీరు చెంచాల స్వభావులు అవుతున్నారా, ఈ వ్యతిరేక భావాలను ప్రచారం చేయటానికి సాహాసిస్తూన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒక్కటే మనుషులు దుఃఖాలకు, బాధలకు మించిన గొప్ప వారు అని స్వామి వివేకానంద ఏనాడో చెప్పారు.