
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కుక్కతోక వంతెన వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దిమ్మకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు కాగా హాస్పటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.