
పుట్టినరోజు నాడే రోడ్డు ప్రమాదంలో యువకుడు శనివారం రాత్రి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన గుంటోజు వంశీచారి(25)బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన పుట్టినరోజు వేడుకను స్నేహితులతో జరుపుకుని ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.