గుడ్డిగా ఎవరిని పడితే వాళ్లని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవాల్సి వస్తుంది. చాలా మంది కొత్త వ్యక్తిని కూడా నమ్మేస్తూ ఉంటారు. అయితే నిజానికి ప్రతి మనిషికి కూడా రెండు సైడ్స్ వుంటాయి. చూడడానికి మనకి ఒకలా కనిపిస్తారు.
కాని మనిషి యొక్క తత్వం మరోలా ఉంటుంది. అందుకే త్వరగా ఎవరినీ నమ్మ కూడదు. అలనే నమ్మేసి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకూడదు. అయితే చాణక్యనీతి ఒక మనిషిని నమ్మే ముందు తప్పని సరిగా ఈ లక్షణాలను పరిశీలించి ఆ తర్వాత మాత్రమే పూర్తిగా నమ్మాలి అని చెప్పింది. మరి ఆ లక్షణాలు గురించి చూద్దాం.
త్యాగాన్ని చూడండి:
మీరు ఎవరైనా నమ్మాలా లేదా అనే సందిగ్ధంలో ఉంటే వాళ్ళ యొక్క త్యాగాన్ని చూడండి. అతనిలో త్యాగ గుణం ఎంత వరకు ఉందో పరిశీలించండి. ఇలా త్యాగ గుణం ఉన్న వాళ్ళు ఇతరులు ఆనందాన్ని మాత్రమే కాకుండా బాధను కూడా పంచుకుంటారు. అలానే అలాంటి వ్యక్తి మనతో వుంటే మనకు బాగుంటుంది.
చరిత్రని చూడండి:
అతని గతం గురించి తప్పక మీరు తెలుసుకోవాలి. గతంలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బాగోలేదు అంటే మీరు వాళ్లతో స్నేహం చేయడం, పరిచయం ఏర్పరచుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే మీరే మోసపోవాల్సి వస్తుంది.
ఈ లక్షణాలను చూడండి:
కోపంగా ఉంటున్నారా, సోమరితనంగా ఉంటున్నారా, అబద్ధాలు చెప్తున్నారా వంటివి చూడండి. నిజం మాత్రమే మాట్లాడే వాళ్ళతో పరిచయం పెంచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఇలా ఎదుటి వాళ్ళతో స్నేహం చేసే ముందు వీటిని గమనించి ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి దగ్గరగా ఉండటం మంచిదని చాణక్యనీతి చెబుతోంది.