రాజకీయాలకతీతంగా చౌటుప్పల్ మున్సిపాలిటీని ₹11 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. SC, ST సబ్ ప్లాన్ కింద ₹1.50 కోట్లు,14,15వ కార్పోరేషన్ నుంచి ₹2 కోట్లతో మురుగునీటి కాల్వలు, CC రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ₹4.50 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.