నల్లబెల్లి మండలం బోలోన్పల్లి గ్రామంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శుక్రవారం పర్యటించారు. ఈటెల రాజేందర్ అమ్మమ్మ గారింటికి వెళ్లి బంధుమిత్రులను కలుసుకున్నారు. గ్రామస్థులు డప్పుచప్పులతో మంగళ హారతులతో ఈటెలకు స్వాగతం తెలిపారు. ఈటెల మేనకోడలు ఊర్మిళ, బిక్షపతి ఇంట్లో కాసేపు సేదతీరి, స్థానికుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నతనం జ్ఞాపకాలను బంధువులు, స్థానికులతో ముచ్చటించారు