తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు దెబ్బలు తీన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. నిరుద్యోగులను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన 9వ తరగతిలోనే సిద్దిపేటలో రిజర్వ్ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నానని గుర్తుచేశారు. అలాగే హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో స్పీకర్ పోచారాన్ని కూడా పోలీసులు కొట్టారని చెప్పారన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు లాఠీ దెబ్బలు తిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.