
నందికొండ: నాగార్జునసాగర్‌లోకి ఎగువ ప్రాంతమైన శ్రీశైలం జలాశయం నుండి 6,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు మొత్తం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు 312 టీఎంసీలు. కాగా ప్రస్తుతం 566.50 అడుగులు 251.1225 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ, slbc జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 31,124 క్యూసెక్కుల నీరు దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు.