వికారాబాద్లో కరోనా మరోసారి విజృంభించింది. పట్టణంతో పాటు మండలంలో సోమవారం 41 కేసులు నమోదయ్యాయి. పట్టణ కమ్యూనిటీ ఆస్పత్రిలో 17 కేసులు నమోదు కాగా, రామయ్య గూడా పీహెచ్సీలో 15 కేసులు, సిద్దులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.