కరీంనగర్: జగిత్యాల: 20 రోజుల్లో 8 హత్యలు

జగిత్యాల జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లోనే ఎనిమిది హత్యలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. చిన్న చిన్న సమస్యలకే కోపోద్రిక్తులై కన్నవారని, కట్టుకున్నవారని, నమ్మినవారనే తేడా లేకుండా హత మారుస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సాటి మనిషిపై ప్రేమ, అభిమానాన్ని చూపాల్సిన మనిషి పగ, కక్ష అంటూ పాశవికంగా అంత మొందిస్తున్న తీరు కలవరపెడుతున్నది.