
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శనివారం తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సినీ గేయ రచయితగా దూసుకెళ్తున్న తరుణంలో ఆయన మరణం తనను కలిచి వేసిందన్నారు.