నేడు ఢిల్లీకి యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్… ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీ నాయకత్వంతో చర్చ

-

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో విజయం సాధించి ఫుల్ జోష్ మీదుంది బీజేపీ పార్టీ. దేశ వ్యాప్తంగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు బీజేపీ ఫ్యాన్స్. ముఖ్యంగా దేశంలో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు. ఈ తరుణంలో అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. 403 స్థానాలకు గానూ 273 స్థానాలు దక్కించుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యోగీ ఆదిత్య నాథ్ మరోసారి సీఎం పదవి చేపట్టబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఈరోజు యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ రావడం ఇదే తొలిసారి. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పార్టీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు.  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కానున్నారు. కొత్త కేబినెట్‌తో పాటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవ తేదీలపై ఆయన బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. దీని కన్నా ఒక రోజు ముందు యోగీ ఆదిత్య నాథ్ తన రాజీనామాను గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు అందించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా యోగీ ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news