జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు

జగిత్యాల జిల్లాలో అర్బన్‌లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం, పచ్చదనం, నీటి నిలువలు, పర్యావరణ పరిరక్షణ పెంపొందించడానికి గాను అటవీశాఖాధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లిలలో అర్బన్‌ అటవీ పార్కుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 129 అటవీ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.