రామగుండం-3 సింగరేణి సంస్థ అడ్రియాల బొగ్గుగనిలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా.. నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వెంకటేశ్వర్లు, నరేష్‌లను సిబ్బంది రక్షించారు. వీరయ్య అనే కార్మికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రక్షణాధికారి జయరాజు, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్‌లను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.