భగవత్ తత్వం అందరికీ అర్థం కాదు. ఓ విధంగా కన్నయ్య చెంత ఇది ఓ లీల. మన తెలుగింటి కోడలికి దక్కిన ఘనత. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మగువ సమర్థతకు దక్కిన గుర్తింపు. నిర్మలా సీతారామన్. ఈ పేరు తెలుగు నేల కు పరిచితమే కదా! మన ఇంటి కోడలీమె! దేశంలోనే అత్యున్నత పదవి అయిన ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించిన వేళ ఆమె గురించి ఇంకొంత!
భలే అత్త!!
ఆధునిక భావాలున్న కుటుంబం. తమిళనాట పుట్టి పెరిగిన ఈ సీత కథలో ఎన్నో మలుపులు. ఉన్న త చదువులు చదివిన నేపథ్యం.. ఓ సాధారణ గృహిణి గా బాధ్యతలు నిర్వర్తించే స్వభావం ఆమె సొం తం.ఆమె అన్నట్లే ఇది నిజంగా పరమాత్మ కృపే! ఔను! విమర్శ ఓ సందేశమే.. ! నేర్చుకున్న వారికి నేర్చుకు న్నంత. ఇందిర తరువాత ఇంతటి అత్యున్నత పదవి దక్కించుకున్న మహిళ ఈమె కావడం మగువలందరికీ ఆదర్శ ప్రాయం.
భరత జాతికి ఇది ఆనందిం చదగ్గ పరిణామం. సరి హద్దుల చెంత ఓ సైనికుడు ఎంతటి నియంత్రణ పాటించాలో అలానే ఈ పదవి విషయంలోనూ అంతే రీతిన ప్రవర్తించాలి. సాధ్యమా! సాధ్యమే!! ఇది ఆమె ఆత్మవిశ్వాసం చెబుతున్న అప్రకటితమైన మాట! మరి! ప్రకటితం ఏంటో చూద్దాం. ఆచరణ యోగ్యతకు విలువిస్తేనే పదవైనా బాధ్యతైనా ఓ విలువను ఆపాదించుకుంటా యి. కాదు నిర్మలమైన మనస్సున్న ఈ సీత పాటించే విలువలను మరింత ఉన్న తీకరించి ఈ ప్రపం చానికి చాటుతాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య ఓ మంచి బాంధవ్యాన్ని ఈ ఇల్లాలు తప్పక పెంచ గలరు.
ఇదీ నేటి మనందరిలో నెలకొన్న విశ్వాసం. ఈ ఉదయం మోసుకువచ్చిన విశ్వాసం. ఆమె గురించి అత్త పరకాల కాళికాంబ ఇలా అన్నారు.. ఎంత తెలివైనదైనా, సమర్థురాలైనా చాలా అణకువ గా ఉంటుంది.ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నా, మంత్రి పదవికి న్యాయం చేసినా వెనకున్న శక్తి ఇదే! ఔను! మరి!! ఈ దక్షతే ఆమెకీ వేళ అత్యున్నత పదవిని వరించేలా చేసింది. ఆమె సామ్యవాదం, ఆయన (పరకాల ప్రభాకర్) వెరసి ఓ ఉన్నత పదవి చేపట్టేందుకు కారణమయ్యాయి.
జయోస్తు.. విజయోస్తు!
రైలు కూత ఇప్పుడు ఎక్కడి నుంచో వినిపిస్తుంది. అది వినిపించిన ప్రతిసారీ ఆమెకు నాన్న సీతారామ న్ గుర్తుకొస్తాడు. ఆ ఇంట నడయాడిన స్త్రీ పురుష సమానత్వం గుర్తుకొస్తుంది. ఆ ఇంట నేర్చిన విశాల దృక్పథాలు గుర్తుకువస్తాయి. అవే ఈ రోజు ఆమెను ఇంతటి సమర్థనీయత ని కట్టబెట్టా యి. ఇప్పుడు అత్తవారిల్లు (నార్సింగి (హైద్రాబాద్) ) కొత్త కాంతులతో తేజరిల్లుతోంది.కన్నవారిల్లు నిన్నటి పెంపకాన్ని గుర్తుచేసుకుని సంబరపడిపోతుంది.
ఆ నిర్మలమైన మనస్సు మరో అడుగు ముందుకు వేసి రేప టి కార్యాచరణకు సిద్ధమవుతోంది.ఇప్పుడు ప్రార్థించండి రేపటి వేళ రక్షణ మంత్రి గా సాధించే ఆమె విజ యం ఈ దేశానికో కీలక మలుపు కావాలని..! ఇప్పుడు వేడుకోండి ఆ కన్నయ్య ను మరింత మంది సామాన్యులను మాన్యశ్రీలుగా మార్చమని! పరకాల వారింటి కోడలు గారూ! ఆల్ ద బెస్ట్.
పీఎస్ :”సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు /బండి దిగిపోయేవాడు జీవుడు” రైలుబండి లాండిదే కదా ! జీవితం. ఎక్కడో ఓ చోట ఆగి కొన్ని కుదుపులోనై, సంఘర్షణాత్మక వైఖరిని తట్టుకుని ముందుకు దూసుకు పోవాల్సిందే!
– రత్నకిశోర్ శంభుమహంతి