కరీంనగర్: ఫ్లెక్సీ వైరల్

Flex
Flex

HZBD: అధికారుల నిర్లక్ష్యానికి సంక్రాంతి శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన ప్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నపూర్ణ థియేటర్ నుంచి SW కాలనీ వైపు వెళ్లేదారిలో గత నవంబర్ 30న డ్రైనేజీ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. కందకం తవ్వి నెల రోజులు గడిచినప్పటికీ నిర్మాణ పనిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.