రాంగోపాల్‌ వర్మ పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌ లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తు… అందరికీ షాక్‌ ఇస్తుంటారు. అయితే… తాజాగా ఆ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పై అక్కినేని నాగర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌ గా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ తో ఆసక్తికర మైన విషయాన్ని తెలిపారు నాగార్జున.

” నా కెరీర్‌ లో శివ సినిమా ను నేను ఎప్పటీకీ మరిచి పోలేను. నాగ చైతన్యకు కూడా తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలని చెబుతుంటాను” అని నాగార్జున వెల్లడించారు. రామ్‌ గోపాల్‌ వర్మకు ఏదైనా మేసేజ్‌ ఇవ్వాలనుకుంటే ఏం చెబుతారు అని ప్రశ్నిస్తే.. ”మీరు ఏం చేసినా ఇంకా రాకింగ్‌ అని చెబుతాను. టీవీ,ట్విట్టర్‌ ఏదైనా సరే.. తను రాక్‌ చేస్తూనే ఉన్నాడు. సినిమాలైనా, ట్విట్టర్‌ అయినా.. గొడవ గొవడ చేస్తుంటాడు అది కూడా తనదైన స్టైల్‌ లో రాకింగ్‌ చేస్తున్నాడు” అని పేర్కొన్నారు నాగార్జున.