
కరీంనగర్ జిల్లాలో వ్యాక్సినేషన్ ఫస్ట్, సెకండ్ డోస్‌లు అత్యంత వేగంగా 100% పూర్తి చేసుకోవడంపై ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని సాధించడంలో వైద్య సిబ్బంది, అధికారులు చూపిన చొరవను కొనియాడారు. రాష్ట్రంలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన వైద్యులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.