ఈ మధ్య కాలం లో చాలా మంది స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా లాభాలు వస్తాయి. అయితే పోస్టాఫీసు కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటిలో డబ్బులు పెట్టడం వలన చక్కటి లాభాలని పొందొచ్చు. పైగా పోస్టాఫీసు లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ప్రతి రోజూ కొంత మొత్తాన్ని పోస్టాఫీసు స్కీమ్స్‌లో డిపాజిట్ చేస్తే లక్షలు సంపాదించవచ్చు.
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో కూడా అంతే. మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్‌లో మీ పిల్లల కోసం ప్రతి రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్లలోనే మీ పిల్లలు లక్షాధికారులు అయిపోవచ్చు. మీ పిల్లలకు లీగల్ గార్డియన్‌గా ఈ స్కీమ్ లో చేరచ్చు. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ప్రతి నెలా కనీసం రూ.100ను డిపాజిట్ చెయ్యాలి. ఐదేళ్లకు మీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.
మీ పిల్లలకే కాదు జాయింట్‌గా, సింగిల్‌గా ఈ అకౌంట్‌ను ఓపెన్ చెయ్యచ్చు. ఈ పోస్టాఫీసు స్కీమ్‌కి 5.8 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. ఈ స్కీమ్‌లో ప్రతి రోజూ రూ.200ను డిపాజిట్ కనుక చేసారంటే ఈ మొత్తంపై లభించే 5.8 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి ఈ మొత్తం రూ.4.18 లక్షలవుతాయి. ఆ తరవాత ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసి.. ప్రతి నెలా రూ.6 వేల ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయానికి రూ.9.75 లక్షలవుతాయి.