
హన్మకొండ జిల్లా గుండ్లసింగారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో నలుగురు కుటుంబ స్నేహితులు కలిసి, వేములవాడ దర్శనానికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఈక్రమంలో హుజురాబాద్ శివారు సింగపూర్ వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. వినోద్, సువర్ణ అనే వ్యక్తులు అక్కడే మృతి చెందారు. గాయపడిన ముగ్గురిని ఎంజీఎంలో చేర్పించారు.