సిరిసిల్లలో మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని సిద్ధులవాడకు చెందిన మహిళ (28)ను విద్యానగర్‌కు చెందిన మోహిన్ గత మూడు నెలల నుంచి ఫోన్లో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహిన్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.