మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం.. వారికి పెన్షన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం..?

-

దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం.

47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 2016 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీని కోసం ఖజానాపై ఎంత భారం పడుతుందనే దానిపై సర్కార్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్.. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైతుబంధుతో ఇప్పటికే 50 వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు భీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news