ధర్మపురి: కోతులకు భయపడి మహిళ మృతి

పండగ రోజు కోతులు ఓ మహిళ మృతికి కారణమయ్యాయి. కోతులు బెదిరించడంతో బంగ్లా పైనుండి ప్రమాదవశాత్తు కిందపడి నారంభట్ల రాజేశ్వరి అనే మహిళ అక్కడి అక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ జరుపుకుందామని గురువారం హైద్రాబాద్ నుండి ధర్మపురికి రాజేశ్వరి వచ్చింది. శుక్రవారం కొత్తగా నిర్మిస్తున్న తన సోదరుని ఇల్లు చూడడానికి బంగ్లా పైకి ఎక్కింది. బంగ్లా పైఉన్న కోతులు అమెపైకి రావడంతో భయంతో కింద పడింది.