సూర్యాపేట పట్టణ కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా మారుస్తానని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బిజెపి, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెపుతారని, టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.