నేటి(గురువారం) నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర మొదలుకానుంది. నేడు ధ్వజారోహన కార్యక్రమం, 14న భోగి పర్వదినం, 15న మకర సంక్రాంతి రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాది వరకు జాతర కొనసాగడం ఈ ఆలయ ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన ఐలోనిలో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. హన్మకొండ, వరంగల్ నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.