సిద్దిపేట: సీఎం కేసీఆర్ ఇటీవ మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించగా గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. రెండు రోజులుగా మల్లన్నసాగర్‌లోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో సందర్శకులు వచ్చి సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు. ఇప్పటికే మల్లన్న సాగర్లో 10టీఎంసీల మేర నీళ్లు ఉండడంతో మరో 7టీఎంసీల నీళ్లు నిలువ చేయనున్నారు.