ఒక ఏడాది కాలం నుంచి తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే..ఎప్పుడైతే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీజేపీ చెక్ పెట్టిందో అప్పటినుంచి బీజేపీ రేసులోకి వచ్చింది…వాస్తవానికి తెలంగాణలో బీజేపీకి పెద్ద బలం లేదు..గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం ఒక సీటుని మాత్రమే గెలిచింది…అలా గెలిచిన పార్టీ ఏకంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు చెక్ పెడుతూ ఉపఎన్నికల్లో సత్తా చాటింది.
ఇలా అనూహ్యంగా ఉపఎన్నికల్లో గెలవడంతో బీజేపీ ఫామ్‌లోకి వచ్చేసింది…ఇక టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ రాజకీయం చేస్తుంది..బలంగా ఉన్న కాంగ్రెస్‌ని సైతం మూడో స్థానానికి నెట్టేసి దూసుకెళుతుంది..అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు..అసలు ఎక్కడా తగ్గకుండా పనిచేస్తున్నారు..మరి ఇలాంటి సమయంలో కొందరు నేతలు బీజేపీని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీలోని కొందరు అసంతృప్తి నేతలు సెపరేట్‌గా రాజకీయం చేస్తూ వస్తున్నారు.
ఈ మధ్య అసంతృప్తి నేతలంతా వరుసపెట్టి సమావేశాలు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే..తమకు పార్టీలో న్యాయం జరగట్లేదనే కోణంలో వారు రాజకీయం నడిపిస్తున్నారు…ఇలా అసంతృప్తులు పెరిగిపోతే పార్టీకే నష్టమని బీజేపీ భావిస్తుంది..ఈ క్రమంలోనే బండి సంజయ్…అసంతృప్తి నేతలతో సమావేశమయ్యారు..అలాగే వారి సమస్యలని తెలుసుకున్నారు…ఇక సమావేశానికి హాజరు కాకుండా…ఇంకా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నవారికి బండి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందే, కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే సహించే ప్రసక్తే లేదని.. వారిపై వేటు తప్పదని బండి వార్నింగ్ ఇచ్చారు.
ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటారని, వారి వల్ల పెద్ద ఉపయోగం ఉండదని, వారిని నమ్మి వేరే నేతలకు కలిస్తే..నష్టపోయేది వారే అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఇది అని.. ఇలాంటి సమయంలో కొందరు అసమ్మతి నేతల మాటలు నమ్మి దారి తప్పవద్దని సూచించారు. మరి చూడాలి వార్నింగ్ తర్వాతైన బీజేపీలో సొంత పోరు తగ్గుతుందేమో.