త్వరలో పట్టణ ప్రాంతాలలో రేషన్ దుకాణాల ద్వారా 2 కిలోలు, 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందుబాటులో తేనున్నామని అడిషనల్ కలెక్టర్ రమేష్ తెలిపారు. తన ఛాంబర్లో ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వినియోగదారులకు 24 గంటలు సిలిండర్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారికి సూచించారు.