మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నియామకాలకు గల అర్హుల జాబితాను సిద్ధం చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారిణి పద్మావతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తామని, కలెక్టర్ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామని, అనర్హుల జాబితాను ప్రదర్శించామని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.