
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెల్లిమల తాండలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన కళావత్ రాజు (32) ఈ నెల 26వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. BDL భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు కాగా శనివారం కుకునూరు గ్రామం రాయికోడ్ పీఎస్ పరిధిలో రాజు తల మొండెం వేరువేరుగా లభ్యమయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.