
మెదక్ ఆర్టీసీ డిపో గ్యారేజీలో బస్సు ఢీకొని మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ అధికారుల సమాచారం ప్రకారం.. మెకానిక్ ఎం.డి.గౌస్ శనివారం సాయంత్రం విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.