మేడ్చల్ : గ్రామ సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు

మేడ్చల్ మండలం సోమారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డికి జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామంలో తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాలి. కానీ గ్రామ సభ నిర్వహించడంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి నిర్లక్ష్యం వహించారని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. షోకాజ్ నోటీసుకు 15 రోజులో వివరణ ఇవ్వాలని సర్పంచ్‌కు ఆదేశించారు.