కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్‌ నాలుగు రోజుల క్రితం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ లో నారా లోకేష్‌ పేర్కొన్నారు. మీ అందరి పూజలు, ప్రార్థనలు, ఆకాంక్షలు, వైద్యుల సూచనల ఫలితంగా తాను కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాను అని నారా లోకేష్‌ తెలిపారు.

“నా పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జ‌న‌హిత‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన మీ సేవాగుణానికి హ్యాట్సాఫ్‌. మీ అంద‌రి ఆకాంక్ష‌లు, పూజ‌లు, ప్రార్థ‌న‌లు, వైద్యుల సూచ‌న‌ల‌ ఫ‌లితంగా నేను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీ అభిమానమే నా ఆరోగ్యం. మీ ఆద‌ర‌ణే నా బ‌లం. స‌దా మీ ప్రేమ‌కు నేను బానిస‌ను.” అంటూ నారా లోకేష్‌ పేర్కొన్నారు. కాగా.. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే.