భోగి పండగ ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక అలంకరణ

పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలలో కొలువై ఉన్న వన దుర్గ భవాని ఆలయంలో శుక్రవారం భోగి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు.