చంద్రబాబు నరకాసురుడు, బకాసురుడు.. భోగి మంటల్లో తగలబెట్టాలి : మంత్రి వెల్లంపల్లి సంచలనం

తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు.
నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని.. చంద్రబాబు రాక్షస ఆలోచనలు బోగి మంటల్లో తగలబడాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

నీచ, దిరిద్ర, హత్య, కుట్ర రాజకీయాలు చేయడాన్ని చంద్రబాబు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మానుకోకపోతే ఇదే భోగి మంటల్లో కార్చిచ్చు అవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. పల్నాడులో హత్యపై పూర్తిగా దర్యాప్తు జరుగుతోందని.. హత్యకు వైసీపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీనే ఇలాంటి హత్యలకు ప్రోత్స హిస్తుందని నిప్పులు చెరిగారు. వచ్చేది మరోసారి జగన్ సర్కార్ అని తేల్చి చెప్పారు. తెలుగు దేశం పార్టీ కి మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు.