మాసాయిపేట: ‘ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు’

crime

చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బెబ్బులి సురేష్ స్థానిక అచ్చంపేట చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.