నారాయణఖేడ్: డ్యామ్‌లో పడి యువకుడి మృతి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకన్న పల్లి తండా ర్యాలమడగుకు చెందిన బర్మావత్ నెహ్రు(26)కల్పగూర్ డ్యామ్ లో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్నేహితులతో కలిసి కల్పగూరు డ్యామ్‌లో స్నానానికి వెళ్లి ఇత రాకపోవడంతో డ్యామ్ లో మునిగిపోయి మృతి చెందాడు. మృతుడు ఏంఎస్ఎన్ ఫార్మ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. మృతుడికి భార్య స్వరూప, 8 నెలల పసిపాప ఉంది.