మేడ్చల్ : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సన్మానం

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును నేడు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో టిఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి… భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.