మేడ్చల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫీవర్ బాధితులను గుర్తించేందుకు ఈనెల 21 నుంచి జిల్లాలో 3,57,211 ఇళ్లలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహించింది. జిల్లాలో 61 గ్రామ చాయతీలు, 13 పురపాలక సంఘాల పరిధిలోని ఇళ్లలో ఐదు రోజులుగా సర్వే బృందాలు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో 50 వేల మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు డిఎంహెచ్ఓ మల్లికార్జున్ రావు తెలిపారు.