గంజాయి విక్రయాలపై బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీసులు సుచిత్ర చౌరస్తాలో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు గంజాయి విక్రేతలు పట్టుబడ్డారు. బుధవారం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న గోవాకు చెందిన ట్రావెల్స్ నిర్వాహకుడు వాల్వేకర్ రోహిత్(31), జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన కృష్ణమౌర్యా(24)లను అదుపులోకి తీసుకోగా వారి వద్ద 13 గ్రాముల కొకైన్ లభించింది. కొంత కాలంగా గంజాయి విక్రయాలు చేపడుతున్నట్లు విచారణలో తేలింది.