హిజాబ్ ధరించడంపై తెలంగాణ ప్రభుత్వం చట్టం తేవాలి : రాజాసింగ్‌

-

హిజాబ్‌ పై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక తీర్పు ను అందరూ గౌరవించాలని… సుప్రీం కోర్టు కి వెళ్లిన ఇదే తీర్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. స్కూల్స్ లో మత రాజకీయాలు మంచిది కాదని… అందరూ స్కూల్ యూనిఫార్మ్ ని ధరించాలని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాజాసింగ్‌ వెల్లడించారు. కొన్ని పార్టీ లు కూడా సహకరిస్తున్నాయని చెప్పారు.

విద్యా సంస్థల్లో విద్య పై, విద్యార్థుల భవిష్యత్ పై దృష్టి పెడితే మంచిదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరిస్తే మేము కాషాయ కండువాలు ధరించి వస్తామని.. తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడింది… దమ్ముంటే అసెంబ్లీ లో హిజాబ్ ధరించి రావొద్దని చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.

కాగా… విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది. ఇస్లాంలో హిజాబ్ ధరించాలనే నిబంధన లేదని హైకోర్ట్ పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. విద్యాసంస్థల ప్రోటోకాల్స్ ని అంగీకరించాల్సిందే అని పేర్కొంది. స్కూల్ యూనిఫాం సహేతుకమైనదని విద్యార్థి అభ్యంతరం చెప్పలేరని పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version