శంషాబాద్ మండలం ముచింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహిస్తున్న యాగశాలలో 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాల పనులను పరిశీలించారు.