రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రులను మంత్రి హరీశ్ రావు తనిఖీలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి పర్యటనలు షురూ కానున్నాయి. ప్రతీ వారం రెండు హాస్పిటల్స్ తో పాటు మెడికల్ కాలేజీలను సందర్శించాలని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, మ్యాన్ పవర్‌లపై ఆరా తీయనున్నారు. సందర్శనకు వెళ్లిన ఆసుపత్రుల్లోనే అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై చర్చించనున్నారు.