సూర్యాపేట జిల్లా విద్యార్థులకు సువర్ణావకాశం

జనవరి 28వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైస్ ఇండస్ట్రియల్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవ రెడ్డి తెలిపారు. మూడు ప్రైవేట్ పెద్ద కంపెనీల్లో జాబ్ మేళా జరుగుతుందని, పదో తరగతి పాస్ 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9676868466 లేదా 9441993390 ఫోన్ చేయవచ్చని సూచించారు.