యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

నవ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తుర్కపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని బద్దుతండాకు చెందిన గూగులోతు చిట్టి(20)కి బొమ్మలరామారం మండలం దేవుని తండాకు చెందిన చిన్నాతో 2021 డిసెంబర్ 21న వివాహమైంది. నిన్న సంక్రాంతి పండుగకు బుద్దు తండాకు బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొని చిట్టి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు.