జగన్ తో చిరంజీవి భేటీ.. రెచ్చగొట్టొద్దంటూ రోజా హాట్ కామెంట్స్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో నిన్న మెగాస్టార్ చిరంజీవి సమావేశం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన చిరంజీవి.. సీఎం క్యాంప్ ఆఫీసులో.. జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ల వ్యవహారం పై వారిద్దరూ చర్చించారు. అయితే జగన్ తో చిరంజీవి భేటీ అయిన అంశంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్ చేశారు.

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడం శుభపరిణామం అని రోజా పేర్కొన్నారు. చిరంజీవి ల ఎవరైనా సీఎం నువ్వు కలిసి ఆ విధంగా తమ సమస్యలను వివరించాలని సూచించారు. కానీ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే ఎవరికీ మేలు జరుగదని హెచ్చరించారు రోజా. సినీరంగం చెబుతున్న అంశాల్లో న్యాయం ఉందనిపిస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రోజా. దీనిపై అనవసరంగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని టాలీవుడ్ పెద్దలకు చురకలంటించారు.